సాహో సాహితీ కవిచక్రవర్తీ శ్రీ నారాయణ రెడ్డీ

ప్రవహిస్తోందదిగో తేట తేనియల నా తెలుగు జీవనదియై
ఆడెనదివో నా తెలుగు కావ్యకన్య ఒయ్యారములొలుకుచు
చిన నాడు ఉగ్గుపాలతో కవిత్వమ్ము నేర్చినాడో ఏమొ
అమృతమ్ము నిండిన తెలుగు పలుకులు పలికినాడు
తెలుగు కవితా గజల్ కి గజ్జెలందియలు కట్టినాడు
జాతీయ వాణిలో తెలుగు కైతకు జ్ఞానపీఠమ్ము వేయించినాడు
తెలుగు కీర్తి పతాకను దిగ దిగంతముల ఎగురవేయించినాడు
తెలుగు పాటకు సాహితీ గౌరవమ్ము కలిగించె వినూత్న శోభలొలుక
సాహితీ రంగమ్మున మేటి ఏరీ నారాయణ రెడ్డికి సాటి
నిక్కమ్ముగ తెలుగుసాహిత్య సరస్వతీ ముద్దు బిడ్డ ఇతడు
తెలుగు సాహితీ రంగమ్ము గుండియలు భగ్గుమనగా
కన్నుమరుగాయె కవితాసేద్యమ్ము సలిపిన నిత్య శ్రామికుండు
అరుగుచున్నాడదివో అభినవ కవి తిక్కన అమరపురికి

సాహితీ చక్రవర్తి, కవిదిగ్గజం నారాయణ రెడ్డి గారికి నివాళులు అరిపిస్తూ

-వీర నరసింహరాజు

Comments